Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్): In India, teachers are given the status of God, so it is said that if the school is a temple, then the teachers who teach in it are like gods. Our parents give birth to us but the teacher tells us to know the difference between right and wrong and plays an important role in character building. Without teachers our future cannot be bright. Therefore the place of Guru is higher than that of the parents.

Just as we feel the need of food every day, in the same way it is very important to have a teacher to achieve the goal in our life. Because only a teacher imparts education selflessly and removes the evils inside us and makes us a better person.

ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్ (Teachers Day speech in Telugu)

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము

ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. “తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని” చాటిచెప్పిన ఆచార్యుడు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘

స్వతంత్ర భారత దేశానికి రాధాకృష్ణ మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా 1952 లో మరియు రెండవ రాష్ట్రపతి 1962 – 1967 మధ్య అయ్యారు. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టిన రోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు

అందుకు అతను సమాధానమిస్తూ “నా పుట్టిన రోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలిపారు.” అప్పటి నుంచి అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ‘బావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు’. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి నాయకులను వీరు తయారు చేస్తారు

See also  Rajasthan Liquor Price List 2023 PDF

సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

సర్వేపల్లి సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు. గురువుకు ఉండాల్సిన లక్షణాలను మన పురాణాల్లోను వివరించారు. గురుశిష్యుల సంబంధాలకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు – అర్జునుడు, చాణక్యుడు – చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు – ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస – వివేకానంద స్వామిలు గురుశిష్యుల సంబంధానికి ప్రతీక.

గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారు. భావి పౌరులకు విద్యా, విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, దేశ వ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. జీవితంలో సరైన మార్గన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటారు

ఉపాధ్యాయులారా మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశా, మార్గదర్శ నాని కి వందనం, పాదాభివందనం

ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు.. ఏది మంచి మార్గం.. ఏది చెడు వంటి విషయాలను చెప్పి.. సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇక చివరిగా మరోసారి గురువులందరికీ నమస్కరిస్తున్నాను. మాలోని తప్పులను తొలగించి.. మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చిన ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు.

Thanks You …….

Download PDF Now

Download PDF Now Speech 2

Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

గురుః బ్రహ్మ గురుః విష్ణు;గురుదేవో మహేశ్వర!
గురుః సాక్షాత్ పరబ్రహ్మ;తస్మైశ్రీ గురవేనమః !!

గురువు- బ్రహ్మ వలె సద్గునములను సృష్టించువాడు.విష్ణువువలె సద్వృత్తులబపాలకుడు మరియు మహాదేవుని (శివుని)వలె దుర్గునాల సంహారకుడు.
ఇంకను జీవ శివుల కలయిక నొనర్చు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం.
ఇది భారతీయ సంస్కృతి యెక్క సుమధుర మరియు భావకావ్యము.
గురువు వద్దకేగుట తోడనే బుద్ధి గ్రహన శీలమవుతుంది,అతని సహవాసము ఎంత మధురమైనదనగా అతని నుండి విడిపోవాలని అనిపించదు.అతని అమ్రుతమయ ద్రష్టిపడుట తోడనే మనసునందలి మాలిన్యము తొలగిపోవును,ఇట్టి గురువును పూజించుట భారతీయ సాంప్రదాయము.

In the end, I just want to say to you in the form of my words that a teacher is a lamp which burns itself and illuminates others, so everyone should respect their dedication and hard work and show gratitude towards them…. Happy Teachers Day

If the download link provided in the post (Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)) is not functioning or is in violation of the law or has any other issues, please contact us. If this post contains any copyrighted links or material, we will not provide its PDF or any other downloading source.

Leave a Comment

Join Our UPSC Material Group (Free)

X